29 August, 2013

తెలుగు భాషా దినోత్సవం

ఈ రోజు  తెలుగు భాషా దినోత్సవం . తెలుగు వారందరికీ  శుభాకాంక్షలు.. 

చాలా మందికి మనసులో సందేహం - ఈ రోజు ఎందుకు పండగలా జరుపుకోవాలి అని. నిజానికి అవసరం లేదు. కాని, మాతృభాష తెలుగై ఉన్నవారు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్న ఈ రోజుల్లో, మన మాతృభాష గుర్తుకుతెచ్చుకోవడానికి ఒక రోజు ఉండడంలో తప్పు లేదనిపిస్తుంది. ఏమంటారు?

స్కూల్స్ లో, కార్యాలయాలలో తెలుగే మాట్లాడాలి, రాయాలి  అని నేను అనను  గాని, తెలుగు మర్చిపోకుండా ఉంటే, అది  చాలు. చిన్న చిన్న విషయాలు పాటించడం వలన ఇది  సాధ్యం అవుతుంది. 

1. మన పిల్లలికి  అమ్మ , నాన్న అనే పదాలు నేర్పిద్దాం (మమ్మీ, డాడీ బదులు )
2. ఇంట్లో తెలుగు మాట్లాడదాం 
3. తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేద్దాం (పంచతంత్రం, రామాయణం, భాగవతం లాంటి కధలు తెలుగులో నేర్పిద్దాం )
4. తెలుగు అక్షరాలు, సంధులు, ,సమాసాలు, వేమన పద్యాలూ పరిచయం చేద్దాం. 
5. వార్తా  పత్రికల్లో వచ్చే తెలుగు కధలు చదవమని పిల్లలిని ప్రోత్సహిద్దాం.  

ఏదో ఒక సినిమాలో (పిల్ల జమిందార్ - నాని సినిమా అనుకుంటా  ) చెప్పినట్టు, తెలుగు అంటే అత్తెసరు మార్కులతో పాసవడం కాదు, అది అమ్మతో  మన అనుబంధం పంచుకోవడం. 
ఏమంటారు ?

ఇట్లు 
మహతీ  రమ్య 




Related Posts Plugin for WordPress, Blogger...